మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (21:53 IST)

అమేజాన్‌తో మాస్టర్‌కు తలనొప్పి..ఏం జరిగిందంటే?

ప్రపంచవ్యాప్తంగా జనవరి 13న విడుదలైన విజయ్ మాస్టర్.. మొదటిరోజు నుండి వసూళ్లపరంగా అసలు తగ్గడం లేదు. దళపతి కెరీర్ లోనే ఈ మూవీకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ లభించాయి. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డార్క్ మెసేజ్ యాక్షన్ సినిమా.. తమిళనాడుతో పాటు విడుదలైన అన్ని రాష్ట్రాలలో కలెక్షన్స్ అదరగొట్టింది. 
 
మాస్టర్ జాన్ పాత్రలో విజయ్.. విలన్ భవాని పాత్రలో విజయ్ సేతుపతి ఇద్దరూ కూడా సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పైసావసూల్ మూవీ అనిపించుకుంది మాస్టర్. ఓవైపు దళపతి మాస్టర్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు తదుపరి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. మాస్టర్ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు 9కోట్లకు కొనుగోలు చేయగా.. ఇప్పటికే 15కోట్ల పైగా వసూల్ చేసిందని సమాచారం.
 
అయితే మాస్టర్ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అలాగే ఫిబ్రవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఇంతలో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అదే అమెజాన్ వారు మాస్టర్ సినిమా జనవరి 28 రాత్రి 10:15 గంటల నుండి అమెజాన్‌లో లభిస్తుందని చెప్పారు. ఈ సినిమా ప్రస్తుతం మంచి వసూళ్లను రాబడుతున్నందున థియేటర్ యాజమాన్యాలకు షాక్ అనే చెప్పాలి. 
 
అయితే మరికొన్ని వారాలపాటు మాస్టర్ థియేటర్లలో రన్ అయ్యే అవకాశం ఉంది. కానీ అమెజాన్ వారు భారీ ధర చెల్లించినట్లు తెలుస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుందని టాక్. మరి మాస్టర్ థియేటర్ లోనే ఉండగా అమెజాన్‌లో హిట్ అవుతుందో లేదో చూడాలి.