గొప్పవారు లోకహితంకోసం..?
పరహితమైన కార్య మతిభారము తోడిదియైన బూను స
త్పురుషుడు లోకము ల్పొగడ బూర్వమునం దొక రాలవర్షము
న్గురియంగ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై
గిరినొక కేల నెత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా..
అర్థం: పూర్వము నేటేట చేయబడు నాచారము చొప్పున యాదవులందఱు నింద్రధ్వజ మను నుత్సవమును జేయుచుండగా దానిని శ్రీకృష్ణుడు మాన్పించినందువలన నింద్రుడు కోపించి, ఱాళ్లవానచే బీడింపగా నచన వర్షోపద్రవమునకు దప్పి తల దాచుకొన జోటులేక బాధపడుచున్న గోవులను గోపాలురను జూచి శ్రీకృష్ణుడుచట గల యొక నెత్తిపట్టి దాని యండను వారల గాపాడెను. అట్లే గొప్పవారు లోకహితంకోసం ఎంత కష్టమైన పనైనా చేస్తారు.