సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (13:44 IST)

పాలు కావలసి వచ్చినప్పుడు ఆవుల వద్దకు వెళ్లి...?

అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్
గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే
పిదికిన గాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా...
 
భాస్కరా.. ఈ భూమి యందెవరికైనను పాలు కావలసి వచ్చినప్పుడు ఆవుల వద్దకు వెళ్లి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలుకొఱకాయావుల పొదుగులను కోసినచో వానికి పాలు లభించవు. అట్లే ప్రజలను పాలించి రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవముగా చూచినచో వారు ఆదరాభిమానము లాతనిపై జూపుటయేగాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వారేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు.