1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
  4. love, wedding, love life, married life, sadguru message

ప్రేమించుకున్నప్పుడు ఉన్న ఆనందం.. పెళ్ళి తర్వాత ఉండదేంటి గురూజీ....?

గురూజీ... మేమిద్దరం భార్యాభర్తలం. మేము ప్రేమించుకున్న సమయంలో ఎంతో ఆనందంగా ఉండేవాళ్లం. కానీ పెళ్లయ్యాక ఆ ఆనందం ఎటు పోయిందో అర్థం కావడంలేదు. అస్సలు సంతోషం లేకుండా పోయింది. కారణం ఏంటి గురూజీ?

love
గురూజీ... మేమిద్దరం భార్యాభర్తలం. మేము ప్రేమించుకున్న సమయంలో ఎంతో ఆనందంగా ఉండేవాళ్లం. కానీ పెళ్లయ్యాక ఆ ఆనందం ఎటు పోయిందో అర్థం కావడంలేదు. అస్సలు సంతోషం లేకుండా పోయింది. కారణం ఏంటి గురూజీ?
 
ప్రేమ అనేది ఏదో కొంతకాలం ఉండిపోయేది కాదు. రూపం మారినంత మాత్రానో, బంధం వల్లనో, వయసైనందువల్లనో తరిగిపోయేదీ కాదు. ప్రేమ గొప్పతనాన్ని గుర్తించడానికి గడచిన కాలాన్ని నెమరువేయటం అనేది దురదృష్టకరమైన విషయం. 
 
ఒక ఆస్పత్రిలో డాక్టర్లు మీటింగ్ ఏర్పాటు చేసుకొన్నారు. అత్యవసర చికిత్స విభాగంలో, రోజు పొద్దున్న 8 గంటలకు ఒకరు మరణిస్తున్నారు... కారణం?
 
వైద్యపరంగా ఏవిధమైన వివరం తృప్తినివ్వలేదు. వైద్యనిపుణులకు ఏదీ ఆనందాన్నివ్వలేదు. ఆ సమయంలో ఏదాన్నా భూతప్రేతాలవంటి అమానుష్య శక్తి ఏదన్నా సరే దాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. నిర్ణయించుకున్న రోజున ప్రతి డాక్టర్ తన ఇష్టదైవాన్ని జపిస్తూ, అక్కడ ఒకపక్క దాక్కుకున్నారు. 
 
సరిగా ఎనిమిది గంటలకు తలుపు తెరుచుకుంది. లోపలకు వచ్చింది. ఒక ఊడ్చుకునే అమ్మాయి. ప్రాణాలు కాపాడే ఆ యంత్రానికున్న ప్లగ్‌ను తీసేసింది. అక్కడ వాక్యూమ్ క్లీనర్ ప్లగ్‌ పెట్టి, గదిని శుభ్రం చేయసాగింది.
 
అలాగే మీరూ ప్రేమ అనే ప్లగ్ పీకేశారు. గడిచిన ఐదేళ్ళుగా మీ కోరికలు, అలవాట్లు ఎన్ని ఏయే మార్పులకు లోనయ్యాయి అన్నది ఆలోచించండి. మీ ఇద్దరికీ ఒకే రకం అనుభవం ఏర్పడుతుంది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
వీకెండ్‌లో బాగా నిద్రపోతున్నారా? అయితే, అలసట తథ్యమంటున్న పరిశోధకులు