1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2016 (12:34 IST)

చైల్డ్ కేర్ : పిల్లలను మట్టిలో ఆడుకునేందుకు వదిలివేయాలి

ఇంట్లో పిల్లలు ఉంటే తల్లులు వారికి రుగ్మతలూ, ఇన్‌ఫెక్షన్లూ సోకకుండా సకల జాగ్రత్తలూ తీసుకుంటారు. దుమ్మూ, ధూళి, చీమా, దోమా కుట్టకుండా అత్యంత శ్రద్ధవహిస్తారు. అయితే ఏడాదిలోపు పిల్లల కొద్దిపాటి మురికి, ఎల

ఇంట్లో పిల్లలు ఉంటే తల్లులు వారికి రుగ్మతలూ, ఇన్‌ఫెక్షన్లూ సోకకుండా సకల జాగ్రత్తలూ తీసుకుంటారు. దుమ్మూ, ధూళి, చీమా, దోమా కుట్టకుండా అత్యంత శ్రద్ధవహిస్తారు. అయితే ఏడాదిలోపు పిల్లల కొద్దిపాటి మురికి, ఎలర్జీ, ఇంట్లో ఉండే బ్యాక్టీరియాకు ఎక్స్‌పోజ్ అయినట్లయితే తదుపరి వయసులో ఎలర్జీలు, వీజింగ్, అస్తమా వంటి వాటినుండి రక్షణ కల్పించబడుతుందని తాజా సర్వేలో వెల్లడైంది. 
 
అదే ఇంట్లోనే చిన్నతనం నుంచి వీటి ప్రభావం కొద్దికొద్దిగా పడుతున్నట్లయితే అన్ని వ్యాధులను తట్టుకునే శక్తి కలుగుతుంది. యేడాది తర్వాత వీటిని పిల్లలు సులువుగా అధిగమిస్తారు. కాబట్టి పిల్లల శరీరానికి మురికి, బ్యాక్టీరియా, ధూలి సోకడమే మంచిదని నిపుణులు అంటున్నారు.
 
తమ పిల్లలు కాలు కింద పెడితే మట్టి అంటుతుందేమోనని తెగ భయపడిపోతుంటారు కొందరు తల్లిదండ్రులు. తరచూ శానిటైజర్‌లు వాడి మరీ వాళ్ల చేతులు శుభ్రం చేసుకోమని చెబుతుంటారు. అలా అసలు మురికీ, మట్టీ అంటనివ్వకుండా వాళ్లను పెంచుదామనుకోవడం పొరపాటే అవుతుంది. అందుకే పిల్లలు మట్టిలో ఆడుకుంటే వదిలేయాలని నిపుణులు సూచిస్తున్నారు.