గురువారం, 20 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 మే 2024 (17:42 IST)

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

gam gam .Ganesha trailer poster
gam gam .Ganesha trailer poster
హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. 
 
ఈ నెల 31న "గం..గం..గణేశా" సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు "గం..గం..గణేశా" సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మంచి క్రైమ్ కామెడీ మూవీగా..ప్రేక్షకులు ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉండబోతోంది.