బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 మే 2024 (16:53 IST)

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

jagan - sharmila
ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో జూన్ 1 వరకు తన కూతుళ్లతో గడపడానికి ఏపీ సీఎం జగన్మోహన్ లండన్‌లో ల్యాండ్ అయ్యారు. సిబిఐ వ్యతిరేకించినా నాంపల్లి సిబిఐ కోర్టు యాత్రకు అనుమతి ఇచ్చింది. మరోవైపు చంద్రబాబు హైదరాబాద్‌లో తన అభ్యర్థులతో సమావేశమై పోలింగ్‌పై  విశ్లేషిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఏపీ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత షర్మిల కామ్ అయిపోయారు. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. 
 
అయితే ఆమె ఎక్స్‌లో ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశాన్ని పోస్ట్ చేశారు. షర్మిల కూడా అన్నయ్య లండన్‌ వెళ్లినట్లు తన కొడుకు, తల్లి విజయ లక్ష్మితో గడపడానికి సెలవుల నిమిత్తం యునైటెడ్ స్టేట్స్ వెళ్లినట్లు టాక్ వస్తోంది.