మంగళవారం, 13 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 మే 2024 (09:32 IST)

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

Jagan_Babu
Jagan_Babu
ఏపీలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత చంద్రబాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉదయం 7.00 గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ చీఫ్ ఓటు వేశారు.
 
ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీరెడ్డితో కలిసి కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
నారా లోకేశ్, ఆయన భార్య నారా బ్రహ్మణి మంగళిగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్‌లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు వేశారు.