1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ram Pothineni’s 'RaPo 23' is the story of a person with the instincts of a wolf.

RAPO23 Update: తోడేలు భావాలున్న వ్యక్తి కథ గా రామ్ పోతినేని రాపో23 చిత్రం

Ram Pothineni’s 'RAPO23' neo-noir pre-look
Ram Pothineni’s 'RAPO23' neo-noir pre-look
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, రచయితగా, దర్శకుడిగా,  కథానాయకుడు వీరగా నటిస్తున్న తన తొలి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'రాపో23' యొక్క నియో-నాయర్ ప్రీ-లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ మోనోక్రోమ్ చిత్రం, V-ఆకారపు హెయిర్‌కట్, టాటూ మరియు ఆసక్తికరమైన టెడ్డీ బేర్‌తో సహా అతని ఉగ్రమైన 'లోన్ వోల్ఫ్' పాత్రను చిత్రీకరిస్తూ, రాబోయే టైటిల్ టీజర్‌పై అంచనాలను పెంచుతోంది. 
 
అతని సోదరుడు కృష్ణ 'రాపో సినిమాటిక్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ మరియు సంయుక్త నటిస్తున్నారు. సామ్ సిఎస్ వంటి అగ్రశ్రేణి ప్రతిభావంతులు సంగీతం అందిస్తుండగా, తిర్రు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది, ఇది తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త యాక్షన్ చిత్రంగా నిలుస్తుందని వాగ్దానం చేస్తోంది.
 
కథానాయకుడు రామ్ పోతినేని నటిస్తూ, దర్శకత్వం వహింస్తున్న #RAPO23 చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా,  #RAPO23 చిత్రం యొక్క ఆసక్తికరమైన 'ప్రీ-లుక్'ను మీ ముందు ఉంచుతున్నాం. టైటిల్ టీజర్ త్వరలో రానుంది! అంటూ పేర్కొన్నారు.  లోన్ వోల్ఫ్ (ఏకాకి తోడేలు) కథ అంటూ హింట్ ఇచ్చారు.
 
రామ్ పోతినేని పాత్ర డిజైన్ కూడా చిత్రంగా వుంటుంది. ఎవరిపైనా ఆధారపడకుండా, స్వతంత్రంగా జీవిస్తూ, తన దారిని తానే ఎంచుకుని, ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే వ్యక్తి. 'లోన్ వోల్ఫ్' తో పోల్చారు.  స్వతంత్రంగా తన దారిని తానే ఎంచుకుని, ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే వ్యక్తి.కథగా రూపొందుతోందని తెలుస్తోంది.
 
ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక మూవీలో విలన్ గా బాలీవుడ్ హీరో, స్టార్ హీరోయిన్ జెనీలియా భర్త రితేశ్ దేశ్ ముఖ్ నటించనున్నారు. రాపో సినిమాటిక్స్‌ బ్యానర్‌ పై కృష్ణ పోతినేని దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను డిసెంబర్ 2026లో విడుదల కానుంది.
 
నటీనటులు: నివేదా పేతురాజ్, సంయుక్త మీనన్ మరియు రితీష్ దేశ్‌ముఖ్ తదితరులు 
దర్శకత్వం & రచన: రామ్ పోతినేని,  సంగీత దర్శకుడు: సామ్ సి.ఎస్., ఛాయాగ్రహణం: తిరునావుక్కరసు, స్టంట్ మాస్టర్: పీటర్ హెయిన్, 
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
repeat movie review :ఈ నగరానికి ఏమైంది, రిపీట్ చిత్రం ఎందుకు తీశారంటే.. రిపీట్ రివ్యూ