బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2016 (14:09 IST)

గుల్బర్గా మారణకాండ: 11 మందికి జీవిత ఖైదు, 13 మందికి ఏడేళ్ల శిక్ష.. మోడీకి క్లీన్‌చిట్!

గుల్బర్గా మారణకాండలో పాల్గొన్న వారికి శుక్రవారం సిట్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయితే 2002లో గుజరాత్‌లో మోడీ (ప్రస్తుత ప్రధాన మంత్రి) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే సిట్ అతన

గుల్బర్గా మారణకాండలో పాల్గొన్న వారికి శుక్రవారం సిట్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయితే 2002లో గుజరాత్‌లో మోడీ (ప్రస్తుత ప్రధాన మంత్రి) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే సిట్ అతనికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. పదేళ్లకు పైగా ఈ కేసుపై విచారణ కొలిక్కి వచ్చింది. తొలుత 66 మందిని నిందితులుగా గుర్తించారు. అయితే వారిలో 36 మందిని నిర్దోషులుగా గుర్తించారు. 
 
వీరిలో ఐదుగురు మృతి చెందగా, ఒకరి ఆచూకీ మాత్రం తెలియలేదు. 24 మందిని దోషులుగా నిర్ధారించారు. వారిలో 11 మందికి జీవితఖైదు, 13మందికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దోషులుగా తేలిన వారిలో ఆయుర్వేద డాక్టర్ అతుల్ వేద్, వీహెచ్‌పీ నాయకుడు  కూడా ఉన్నారని సిట్ కోర్టు వెల్లడించింది. 
 
కాగా, 2002 ఫిబ్రవరి 28... గుజరాత్ ఓ చీకటి దినం. ఆ రోజున గుల్బర్గా సొసైటీపై అల్లరి మూకలు దాడి చేసి దొరికిన వారిని దొరికినట్టు నరికిపారేశారు. మృతిచెందిన వారిలో మాజీ కాంగ్రెస్ ఎంపీతో సహా ఎహసాన్ జాఫ్రీ కూడా ఉన్నారు.