1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 9 నవంబరు 2016 (16:06 IST)

మ‌న‌కి కాద‌ట‌... పాక్‌కి షాక్ ఇవ్వ‌డానికే పెద్ద నోట్ల బ్యాన్

న్యూఢిల్లీ : అవును! ప్ర‌ధాని మోదీ ఇచ్చిన షాక్ మ‌న‌కి కాద‌ట‌. న‌కిలీ క‌రెన్సీని భారీగా భార‌తదేశంలో డంప్ చేసేసిన పాకిస్తాన్ దేశానికి షాక్ ఇవ్వ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అదీ ఆఖ‌రి నిమిషం వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌కుండా... ర‌హ‌స్యంగా ఈ ప‌ని మోదీ కానిచ

న్యూఢిల్లీ : అవును! ప్ర‌ధాని మోదీ ఇచ్చిన షాక్ మ‌న‌కి కాద‌ట‌. న‌కిలీ క‌రెన్సీని భారీగా భార‌తదేశంలో డంప్ చేసేసిన పాకిస్తాన్ దేశానికి షాక్ ఇవ్వ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అదీ ఆఖ‌రి నిమిషం వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌కుండా... ర‌హ‌స్యంగా ఈ ప‌ని మోదీ కానిచ్చేశార‌ట‌. దీనివ‌ల్ల మ‌న బ్లాక్ మ‌నీ పెద్ద‌ల క‌న్నా ఎక్కువ... న‌కిలీ క‌రెన్సీ క‌ట్ట‌లు ద‌గ్గ‌ర పెట్టుకుని కూర్చున్న ఉగ్ర‌వాదుల‌కు, వారి ఏజెంట్ల‌కు ఇది కోలుకోలేని దెబ్బ అట‌.
 
నల్లధనం, అవినీతి ధనం, నకిలీ నోట్లు, రాజకీయ అవినీతి, అక్రమ నిల్వలకు స్థూల పరిష్కారంగా మోదీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఓ సంచలనం. దాని మంచీచెడూ ఓసారి పక్కన పెడితే… ఆద్యంతం చిన్న విషయం కూడా లీక్ గాకుండా ఆపరేట్ చేసిన విధానం మాత్రం అద్భుతం. ఇండియా వంటి దేశాల్లో దాన్ని ఊహించలేం. ఎక్కడా చిన్న వివరం కూడా ఇన్నాళ్లూ బయటపడలేదు. అత్యున్నత స్థాయిలో ఆర్బీఐ వర్గాలతో సంప్రదింపులు, వ్యూహాలు, ప్లాన్…. వెరసి చివరలో మోదీ స్వయంగా ప్రకటన. అనూహ్యం…. చివరకు కేబినెట్ మంత్రులకు, కీలకమైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు కూడా తెలియనంత గోప్యంగా దాన్ని అట్టిపెట్టి, ఒకేసారి బ్లాస్ట్ చేశారు. అయితే ఈ రహస్యం ఎందుకంటే….
 
ప్రస్తుతం పాకిస్థాన్ వ్యవస్థీకృతంగా కొన్నివేల కోట్ల రూపాయల 500, 1000 నోట్లను దేశంలోకి ప్రవేశపెట్టింది. అది విస్తృతంగా చలామణీలో ఉంది. దాన్ని ముందు డిఫ్యూజ్ చేయాలంటే మొత్తం ఆ నోట్లనే రద్దు చేయాలి. అదీ ఓ ప్లాన్… పార్టీ నాయకులు, మంత్రులు, చివరకు అధికార్లకు తెలిసినా అది ఢిల్లీలో తిష్టవేసిన వందలమంది దళారుల ద్వారా దేశం మొత్తం లీక్ అయిపోతుంది. తద్వారా ఆశించిన ఫలితం నెరవేరదు. అందుకే ఈ సీక్రెట్ ఆపరేషన్… కానీ పర్‌ఫెక్ట్‌గా అమలు చేశారు.
 
ఇక పర్ ఫెక్ట్ సెక్యూరిటీ ఫీచర్లతో 500, 2000 రూపాయల నోట్లు రాబోతున్నాయి. ఇప్పటికిప్పుడు వాటికి జాలీ నోట్లు (నకిలీ నోట్లు) ప్రవేశపెట్టడం కష్టం… కనుక, పెద్ద విలువ నోట్లు మార్కెట్లో ఉంచుతూనే, ఇప్పుడు నల్ల నోట్లను నిర్మూలించడమే ధ్యేయంగా రూపొందిన ప్లాన్ ఇది.