గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2024 (12:37 IST)

రాహుల్‌గాంధీ ఖాతాలో అరుదైన ఘటన.. తొలి ప్రతిపక్ష నేతగా రికార్డ్

Rahul Gandhi
Rahul Gandhi
ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాహుల్.. పదేళ్ల తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతపక్ష నేతగా రికార్డులకెక్కారు. 
 
తెల్లని కుర్తా ధరించి వేడుకలకు హాజరైన ఆయన ఒలింపిక్ వీరులు మనూ భాకర్, సరజ్‌బోత్ సింగ్, ఆర్పీ శ్రీజేశ్, భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తదితరులతో కలిసి కూర్చున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు అవసరమైనన్ని స్థానాలను ప్రతిపక్ష పార్టీలేవీ సాధించలేకపోయాయి. ఫలితంగా 2004 నుంచి 2024 వరకు ఈ పోస్టు ఖాళీగా ఉంది. 
 
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను దక్కించుకోవడంతో లోక్‌సభలో అతిపెద్ద రెండో పార్టీగా అవతరించింది. దీంతో జూన్ 25న ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అదే హోదాలో నేడు స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నారు.