మమతా కులకర్ణి కీలక సూత్రధారిగా ముంబై డ్రగ్స్ రాకెట్ : బాలీవుడ్ ప్రముఖుల హస్తం?
బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ప్రధాన సూత్రధారిగా ముంబై డ్రగ్స్ రాకెట్ జరుగుతున్నట్టు ముంబై మహానగర పోలీసులు తేల్చారు. ఇందులో బాలీవుడ్‌కు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు బుల్లితెర నటీటులు, రాజకీయ నాయకులు అ
బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ప్రధాన సూత్రధారిగా ముంబై డ్రగ్స్ రాకెట్ జరుగుతున్నట్టు ముంబై మహానగర పోలీసులు తేల్చారు. ఇందులో బాలీవుడ్‌కు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు బుల్లితెర నటీటులు, రాజకీయ నాయకులు అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
ఇటీవల ముంబై కేంద్రంగా కోట్లాది రూపాయల డ్రగ్ రాకెట్ సాగుతున్నట్టు వెలుగు చూసిన విషయం తెల్సిందే. ఇందులో కొందరు పెద్దలతో పాటు బాలీవుడ్ నటుడు, టీవీనటుల పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న ఈ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ కు కింగ్‌లుగా సినిమా మాజీ నటి మమతా కులకర్ణితోపాటు ఆమె భాగస్వామి విక్కీ గోస్వామిలు వ్యవహరిస్తున్నారని ముంబై పోలీసులు వెల్లడించారు.
దీంతో పోలీసులు ఈ డ్రగ్ రాకెట్‌పై విచారణను ముమ్మరం చేయడంతో ఈ రాకెట్ వెనుక ఉన్న అసలు విషయాలు వెలుగు చూశాయి. ఈ డ్రగ్ రాకెట్‌లో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడితోపాటు టీవీ నటీమణులు, చిన్నచిన్న టీవీ నటుల పాత్ర ఉన్నట్లు పోలీసులకు కనుగొన్నారు. డ్రగ్ సరఫరా ఎలా చేయాలనే అంశంపై కింగ్ గోస్వామి, మమతా కులకర్ణిలు ముంబై హోటళ్లలోని పలువురు టీవీ నటులతో మంతనాలు జరిపినట్టు పోలీసులు కనుగొన్నారు. కాగా, ఈ డ్రగ్ రాకెట్ లో నిందితులైన 17 మందిలో ఇప్పటికే పదిమందిని అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి పంపించారు.