శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (11:38 IST)

అమ్మా అన్నాడీఎంకే పేరిట ఓపీఎస్ కొత్త పార్టీ-ఎన్నికల గుర్తుగా.. రెండాకుల్ని పోలిన విద్యుత్ స్తంభం

మాజీ సీఎం పన్నీర్ సెల్వం కొత్త పార్టీ పెట్టేశారు. పార్టీ పేరును అమ్మా అన్నాడీఎంకేగా, చిహ్నంగా రెండాకులను పోలిన విద్యుత్ దీపాలతో కూడిన ఎలక్ట్రికల్ పోల్‌ను ఎన్నికల సంఘం ఓపీఎస్‌కు ఓకే చేసింది. అలాగే శశికళ వర్గానికి ఆటో రిక్షాను చిహ్నంగా ఇచ్చేసింది.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం చిన్నమ్మ వర్గంపై తిరుగుబాటు చేసి.. అన్నాడీఎంకే పార్టీని తన చేతిలోకి తీసుకోవాలని నానా తంటాలు పడిన ఓపీఎస్‌ కొత్త పార్టీ పెట్టేశారు. తద్వారా అమ్మ ఆశయాలకు అనుగుణంగా ప్రజల్లోకి వెళ్ళాలని ఓపీఎస్ నిర్ణయించారు. ఇప్పటికే ఆర్కేనగర్ ఉపఎన్నిక ముంగిట 'రెండాకుల' చిహ్నాం మీద నెలకొన్న పంచాయతీకి ఎన్నికల సంఘం శశికళకు పన్నీర్‌కు షాక్ ఇచ్చింది. 
 
బుధవారం నాడు దాదాపు ఆరుగంటల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న సీఈసీ రెండాకుల గుర్తును ఎవరికీ కేటాయించడం లేదని తేల్చేసింది. తాత్కాలికంగా ఈ చిహ్నాన్ని ఎన్నికల నుంచి నిషేధిస్తున్నామని, దానికి గల కారణాన్ని ఎన్నికల కమిషన్ వివరించింది.  
 
ఆర్కేనగర్‌‍లో సత్తా చాటేవారికే భవిష్యత్తులో మంచి పొలిటికల్ మైలేజీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న తరుణంలో.. అన్నాడీఎంకే నుంచి దినకరన్, ఇటు పన్నీర్ వర్గం నుంచి మధుసూదన్, మరోవైపు జయలలిత మేనకోడలు దీప.. వీరి మధ్యలో బీజేపీ పోటీపడుతున్నాయి. వీరిలో ఆర్కేనగర్ ఓటరు నాడిని పట్టుకునేదెవరో తెలియాలంటే ఏప్రిల్ 12న జరిగే ఎన్నిక దాకా వేచి చూడాల్సిందే 
 
ఈ నేపథ్యంలో మాజీ సీఎం పన్నీర్ సెల్వం కొత్త పార్టీ పెట్టేశారు. పార్టీ పేరును అమ్మా అన్నాడీఎంకేగా, చిహ్నంగా రెండాకులను పోలిన విద్యుత్ దీపాలతో కూడిన ఎలక్ట్రికల్ పోల్‌ను ఎన్నికల సంఘం ఓపీఎస్‌కు ఓకే చేసింది. అలాగే శశికళ వర్గానికి ఆటో రిక్షాను చిహ్నంగా ఇచ్చేసింది.