శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 30 మార్చి 2017 (03:17 IST)

యూపీని మోదీ నాకు బిక్షగా ఇచ్చారు.. రోగం వదిలిస్తానన్న సీఎం యోగి

ఒక సన్యాసి దేశాలంత పెద్దదైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అపూర్వ ఘటన జరిగినప్పుడు ఆయనకు ఎన్ని బట్టలున్నాయో తెలుసా..బహుశా ఎవరూ నమ్మరు. కేవలం ఒక జత బట్టలు. స్వాముల పేర్లతో, దొంగ బాబాల పేర్లతో కోట్లు గడిస్తూ వందల ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైన ఆశ్రమాలు

ఒక సన్యాసి దేశాలంత పెద్దదైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అపూర్వ ఘటన జరిగినప్పుడు ఆయనకు ఎన్ని బట్టలున్నాయో తెలుసా..బహుశా ఎవరూ నమ్మరు. కేవలం ఒక జత బట్టలు. స్వాముల పేర్లతో, దొంగ బాబాల పేర్లతో కోట్లు గడిస్తూ వందల ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైన ఆశ్రమాలు నిర్మించుకుంటున్న పాడు కాలంలో సన్యాసులు ఇలా కూడా ఉంటారా అంటే అవునంటున్నారు ఈ యోగి. 
 
ఈరోజుల్లో సన్యాసులకు ప్రజలు బిక్ష కూడా వేయడం లేదని అలాంటి నేపథ్యంలో ఒక జత బట్టలు మాత్రమే ఉన్న నాకు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాన్ని ప్రధాన మోదీ బిక్షగా ఇచ్చారని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. తనను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మోదీని మర్యాద పూర్వకంగా కలిశానని, ఆయన నుంచి చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నానని యోగి చెప్పారు. 
 
అయితే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించినప్పటికీ సన్యాసినైన తాను ముఖ్యమంత్రి అవుతానని అసలు ఊహించలేదని యోగి అన్నారు. ఆ కబురు నాకు చేరవేసింది మా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. ప్రమాణ స్వీకారానికి ఒక్క రోజు ముందు మాత్రమే యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆయన నాకు చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా దగ్గర అప్పుడు ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయి అని యోగి చెప్పారు.
 
అయితే సన్యాసినే అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌కు పట్టిన రోగం ఏంటో తనకు బాగా తెలుసని, దాన్ని వదిలించేందుకు గట్టిగా ప్రయత్నిస్తానని యోగి చెప్పారు. ఈ క్రమంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడనని చెప్పారు.