ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 జూన్ 2017 (11:32 IST)

కట్టుకున్న భార్యపై స్నేహితులతో కలిసి అత్యాచారం.. రంజాన్ ఉపవాసం.. కుటుంబ కలహాలతో?

కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమెపై కాటేశాడు. స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం బెంగళూరులో లేటుగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే

కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమెపై కాటేశాడు. స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం బెంగళూరులో లేటుగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని శివాజీనగర పరిధిలోని బంబూబజార్‌ వద్ద నివసిస్తున్న 35 ఏళ్ల మహిళపై ఈనెల 11వ తేదీన అతని భర్త, నలుగురు స్నేహితులు ఇంట్లో సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో బాధిత మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఇరుగుపొరుగు వారు ఆస్పత్రిలో చేర్పించారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఆమె ఉపవాసం ఉంటోంది. 
 
అయినా కిరాతకుడైన భర్త ఘోరానికి పాల్పడ్డాడు. ఘోరాన్ని తనలోనే దాచుకుని ఆమె కుమిలిపోసాగింది. చివరికి తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం రాత్రి బాధితురాలితో కలసి శివాజీనగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలతో భార్యపై పగ పెంచుకున్న భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆమె బంధువులు చెప్తున్నారు. కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా భార్యపై స్నేహితులతో కలిసి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాడని వారు మండిపడుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.