శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2016 (10:04 IST)

పెళ్లిపందిరిలో సందడే సందడి.. వరుడు అరెస్ట్.. పెళ్ళి పెటాకులు.. ఏం చేశాడంటే?

పెళ్లిపందిరిలో సందడే సందడి. పెళ్ళి మంటపం కోలాహాలంగా ఉంది. పెళ్ళి పీటలపైకి చేరుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతలోనే మంటపంలోకి వచ్చిన పోలీసులు ఏకంగా వరుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో పెద్దలు, బంధువ

పెళ్లిపందిరిలో సందడే సందడి. పెళ్ళి మంటపం కోలాహాలంగా ఉంది. పెళ్ళి పీటలపైకి చేరుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతలోనే మంటపంలోకి వచ్చిన పోలీసులు ఏకంగా వరుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో పెద్దలు, బంధువులు షాక్ తిన్నారు. మరికొద్ది క్షణాల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఓ హత్య కేసుకు సంబంధించి జైలుకెళ్లాడు. దీంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన చిక్కమంగళూరు జిల్లా, జిన్నాపుర వర్తకుల భవనంలో మంగళవారం చోటుచేసుకుంది. 
 
పోలీసుల వివరాల్లో వెళితే.. చిక్కమంగళూరు జిల్లా, ముడిగెరె తాలూకా, జీ.హొసహళ్లి గ్రామానికి చెందిన యువతితో సుల్లా తాలూకాలోని ఎనేకల్ గ్రామానికి చెందిన ఎస్‌వీ.కిరణ్ అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది. ఈ మేరకు మంగళవారం జిన్నాపుర వర్తకుల భవనంలో వివాహ ఏర్పాట్లు చేశారు. వరుడిని పెళ్లి పీటలపైకి తీసుకెళ్లేందుకు బంధువులు సమాయత్తమవుతుండగా అక్కడకు చేరుకున్న రామనగర పోలీసులు వరుడు కిరణ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. 
 
బెంగళూరు నగరంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న సమయంలో కిరణ్ ఓ వృద్ధుడిని హత్యచేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు కిరణ్‌కోసం పోలీసులు గాలిస్తున్నారు. పక్కా సమచారంతో పోలీసులు మంగళవారం జిన్నాపుర చేరుకొని కిరణ్‌ను అరెస్ట్ చేశారు.