ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (13:01 IST)

బెంగళూరులో కీచక పర్వం.. యువతులపై అసభ్య ప్రవర్తన.. నలుగురిపై కేసు

ఐటీ రాజధాని బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జరిగిన కీచక పర్వానికి సంబంధించిన పోలీసులు 4 నుంచి 12 మందిని అరెస్టు చేశారు. నిందితులను బానసవాడి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. కొత్త ఏడాది వ

ఐటీ రాజధాని బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జరిగిన కీచక పర్వానికి సంబంధించిన పోలీసులు 4 నుంచి 12 మందిని అరెస్టు చేశారు. నిందితులను బానసవాడి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. కొత్త ఏడాది వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీన పలువురు యువతులతో ఓ గ్యాంగ్ అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
అంతేగాకుండా.. మహిళల రక్షణపై పోలీసులపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో అరెస్టయిన నిందితులపై లైంగిక వేధింపుల చట్టాలకింద కేసులు నమోదు చేశారు. ఈ యువతిని వేధింపులకు గురిచేసిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలను రేపింది. కానీ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
 
దీంతో ఫుటేజీ ఆధారంగా పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. వీరిలో ఒకరు ఆ యువతి తరచూ వెళ్లే దుకాణంలో పనిచేసేవాడే కావడం గమనార్హం. దుండగులు యువతిని వేధించేటప్పుడు ఆ మార్గంలో వెళ్తున్న కొందరు జరిగింది చూసి కూడా ఎవరూ కూడా ఆ దుశ్చర్యను అడ్డుకోలేకపోయారు.