గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (08:56 IST)

అమ్మానాన్నలతో మాట్లాడేందుకు సెల్ ‌అడిగిందనీ... గర్భిణీని భవనం నుంచి కిందికి తోసేశాడు!

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సెల్‌ఫోన్ అడిగినందుకు నిండు గర్భిణీని ఆమె భర్త రెండు అంతస్తుల భవనం నుంచి కిందికి తోసేశాడో కిరాతక భర్త. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు వ

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సెల్‌ఫోన్ అడిగినందుకు నిండు గర్భిణీని ఆమె భర్త రెండు అంతస్తుల భవనం నుంచి కిందికి తోసేశాడో కిరాతక భర్త. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు విరిగిపోగా గర్భంలోని శిశువు ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్, దర్భంగా జిల్లాలోని మంజిహోరా గ్రామానికి చెందిన బబితాదేవి (28), ఠాకూర్ భార్యాభర్తలు. వీరిద్దరు రెండో అంతస్తులోని ఓ ఫ్లాట్‌‍లో నివశిస్తున్నారు. ఇంటి డాబాపై ఠాకూర్ ఫోన్ మాట్లాడుతుండగా, తన తల్లిదండ్రులకు పోన్ చేసుకునేందుకు ఓసారి మొబైల్ ఇవ్వాలని బబితాదేవి భర్తను అడిగింది.
 
అంతే ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఠాకూర్ గర్భిణీ అని కూడా చూడకుండా కిందికి తోసేశాడు. ఈ ప్రమాదంలో ఆమె కాళ్లు విరిగిపోగా గర్భంలో పెరుగుతున్న ఏడు నెలల శిశువు మరణించింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసి మృతి చెందిన శిశువును తొలగించారు. బబిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఠాకూర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.