సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (09:27 IST)

నరేంద్ర మోడీ పద్మవ్యూహంలో షరీఫ్ చిక్కుకున్నట్టే... బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసిన పద్మవ్యూహంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుకున్నట్టేనని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నారు. యురి ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసిన పద్మవ్యూహంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుకున్నట్టేనని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నారు. యురి ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్ ముష్కర మూకలు దాడి చేయగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
దీనిపై స్వామి మాట్లాడుతూ... ప్రధాని మోడీ సర్కారు వేసిన దెబ్బతో పాక్ ఇక కోలుకోలేదన్నారు. అయితే ఆ నిర్ణయం ఏంటనే విషయంపై ఆయన సస్పెన్స్ కొనసాగించారు. పాక్‌పై భారత్ దాడి చేస్తుందా? చేస్తే ఏ తరహాలో చేస్తుంది? పాక్షిక యుద్ధమా లేక సంప్రదాయక యుద్ధమా? పీఓకేలో ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేస్తుందా లేక లాహోర్ దాకా భారత సేనలు దూసుకెళ్తాయా? వీటన్నంటికీ సమాధానం అతి త్వరలోనే వస్తుందన్నారు.