బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:46 IST)

పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయ్.. తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పెద్ద‌నోట్ల ర‌ద్దుతో బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ‌లు పెరిగాయి. దీంతో మ‌రికొంద‌రిక

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పెద్ద‌నోట్ల ర‌ద్దుతో బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ‌లు పెరిగాయి. దీంతో మ‌రికొంద‌రికి రుణాలిచ్చే సౌక‌ర్యం క‌లుగుతుంది. వ‌డ్డీ రేట్లు త‌గ్గుతాయని పేర్కొన్నారు. ఫిబ్ర‌వ‌రి 1కి బ‌డ్జెట్‌ను ముందుకు జ‌రిపామని.. గ్రామీణ ప్రాంతాల‌పై దృష్టి పెట్ట‌డంతో పాటు మౌలిక సౌక‌ర్యాలకు ప్రాధాన్య‌త ఇస్తున్నట్లు ప్రకటించారు. 
 
రైల్వే బ‌డ్జెట్‌ను సాధార‌ణ బ‌డ్జెట్‌లో క‌లిపేసినా... రైల్వేల స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి కొన‌సాగుతుందని జైట్లీ ప్రకటించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో రానున్న కాలంలో మ‌రిన్ని మంచి ఫ‌లితాలు వ‌స్తాయని.. రైతులకు అండగా ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌ను 30శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమ‌, గ్రామీణ ఉపాధి, యువ‌త‌, మౌలిక సౌక‌ర్యాలు, ప‌టిష్ట‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ సుప‌రిపాల‌న‌, విత్త విధానం, ప‌న్ను సంస్క‌ర‌ణ‌లు, నిజాయితీ ప‌నుల‌కు పెద్ద‌పీట‌ వేసినట్లు వెల్లడించారు. 
 
పెద్దనోట్ల రద్దుతో నల్లధనానికి కళ్లెం వేశామని.. దొంగ నోట్లు, న‌ల్ల‌ధ‌నం, ఉగ్ర‌వాదానికి చేయూతనిచ్చాయని జైట్లీ తెలిపారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు వేగ‌వంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్‌టీ ఒక‌టని తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ ఒక‌టిగా ఐఎంఎఫ్ పేర్కొందనే విషయాన్ని జైట్లీ గుర్తు చేశారు. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అనిశ్చితిలో ఉంది. అయినా భార‌త్ అన్నిరంగాల్లో ప్ర‌గ‌తి సాధించింది. ద్ర‌వ్యోల్బ‌ణం పూర్తిగా అదుపులో ఉందని ఆయన పేర్కొన్నారు.