శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (10:56 IST)

ఆరుగురు కుమార్తెలకు ఒకేసారి పెళ్లి చేసిన ఛాయ్ వాలా.. భారీగా కట్నం? ఎలా?

అమ్మాయికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అమ్మో కట్నం ఇవ్వాలని తలపట్టుకుంటారు. అలాంటిది ఓ ఛాయ్‌లాలా మాత్రం ఒకేరోజు తన ఆరుగురు కుమార్తెలకు పెళ్లి చేసిపెట్టి.. భేష్ అనిపించుకున్నాడు. అదీ సాధారణంగా ఆరుగురు

అమ్మాయికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అమ్మో కట్నం ఇవ్వాలని తలపట్టుకుంటారు. అలాంటిది ఓ ఛాయ్‌లాలా మాత్రం ఒకేరోజు తన ఆరుగురు కుమార్తెలకు పెళ్లి చేసిపెట్టి.. భేష్ అనిపించుకున్నాడు. అదీ సాధారణంగా ఆరుగురు కుమార్తెలకు పెళ్లి చేయలేదు. భారీ మొత్తంలో కట్నం ముట్టజెప్పాడు. అయితే అడ్డంగా ఆదాయపు పన్ను అధికారుల కంట్లో పడ్డాడు. ఇంకేముందు పెళ్లిళ్లపై సరైన సమాధానం ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని కొత్‌పుల్తీ సమీపంలోని హదుటా వద్ద ఓ టీ స్టాల్‌ను నడుపుతున్నాడు.. లీలారామ్ గుజ్జర్ అనే వ్యక్తి. ఏప్రిల్ 4న తన ఆరుగురు కూతుర్లకు ఘనంగా పెళ్లి చేశాడు. వేడుకలో స్థానిక ప్రజలు, కమ్యూనిటీ నేతలు చూస్తుండగా పెద్దపెద్దగా నోట్లను లెక్కపెట్టి అల్లుళ్లకు కోటిన్నర చొప్పున కట్నం ఇచ్చాడు. ఈ విషయం చివరకు ఐటీ కంట్లో పడింది.
 
ఇంకేముంది.. ఆ ఛాయ్‌వాలా ఐటీ అధికారుల నుంచి నోటీసులు అందుకున్నాడు. ఈ మొత్తం ఎలా సంపాదించావో డీటేల్స్ ఇవ్వాలని సమన్లు పంపారు. ఇంకా లీలారామ్ మైనర్లకు పెళ్లి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.