ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 జులై 2017 (11:44 IST)

రైళ్ల ఆహారంలో నాణ్యత గోవిందా: వెజ్ బిర్యానీలో బల్లి.. సురేష్ ప్రభుకు ట్వీట్..!

రైళ్లలో ఆహారం నాణ్యత లోపించిందని పార్లమెంట్‌లో కాగ్ తన నివేదిక ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సాక్ష్యంగా.. రైళ్లలో ప్రయాణీకులకు ఇచ్చే వెజ్ బిర్యానీలో బల్లి కనిపించింది. వివరాల్లోకి వెళి

రైళ్లలో ఆహారం నాణ్యత లోపించిందని పార్లమెంట్‌లో కాగ్ తన నివేదిక ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సాక్ష్యంగా.. రైళ్లలో ప్రయాణీకులకు ఇచ్చే వెజ్ బిర్యానీలో బల్లి కనిపించింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు‌ ఓ భక్తుల బృందం పూర్వ్‌ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. వీరు వెజ్ బిర్యానీని ఆర్డర్‌చేసి తినడం ప్రారంభించారు.
 
ఈ నేఫథ్యంలో ట్రైన్ పాట్నా సమీపానికి చేరుకుంది. ఈ సమయంలో వారికి వెజ్ బిర్యానీలో బల్లి కనిపించింది. దీనిని తిన్న ఒక వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. ఈ విషయమై భక్త బృదం రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు ఏమాత్రం పట్టించుకోలేరు. దీంతో భక్తులు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. ఈ ట్వీట్‌‌కు స్పందన లభించింది. రైలు యూపీలోని మొగల్ సరాయ్ చేరుకోగానే రైల్వే అధికారులు బాధితునికి వైద్యం చేయించారు. 
 
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సీనియర్‌ రైల్వే అధికారి కిశోర్‌కుమార్‌ వెల్లడించారు. ఈ ఘటనకు చింతిస్తున్నామని.. విచారణ అనంతరం నివేదికను రైల్వే శాఖ మంత్రికి అందజేయనున్నట్లు చెప్పారు. కాగా రైళ్లలోని ఆహార పదార్థాల్లో నాణ్యత ఉండడం లేదని, రైల్వేలో స్వచ్ఛత, పరిశుభ్రత కనిపించడం లేదు అని కాగ్ పేర్కొంది. డస్ట్ బిన్ లు మచ్చుకైనా లేవని, రైళ్లలో అపరిశుభ్రమైన నీళ్లతో ఆహారం వండుతున్నారని కాగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.