గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (15:41 IST)

సీఎం పళనిసామికి పన్నీర్ వర్గం షాక్.. సీఎం పోస్ట్, పార్టీ పగ్గాలిస్తేనే? దినకరన్‌కు మరో షాక్

తమిళనాడు సీఎం పళనిసామికి పన్నీర్ సెల్వం వర్గం షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవే కాకుండా, ముఖ్యమంత్రి పదవి సైతం పన్నీర్ సెల్వంకే ఇవ్వాలని ఓపీఎస్ వర్గీయులు పట్టుబడుతున్నట్లు సమా

తమిళనాడు సీఎం పళనిసామికి పన్నీర్ సెల్వం వర్గం షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవే కాకుండా, ముఖ్యమంత్రి పదవి సైతం పన్నీర్ సెల్వంకే ఇవ్వాలని ఓపీఎస్ వర్గీయులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ డిమాండ్‌కు పళని వర్గాలు నో అంటున్నారు. కానీ ఇరు వర్గాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతూనే వున్నాయి. 
 
కాగా.. తమిళనాడులో రాజకీయా పరిణామాలు సెకను సెకనుకు మారిపోతున్నాయి. శశికళ, దినకరన్ లకు చెక్ పెట్టేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలసిపోయిన సంగతి తెలిసిందే. ఇకపోతే... అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ బుధవారం చెన్నైలోని ఎగ్మూర్‌లో ఉన్న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరైనాడు.
 
నియమాలు ఉల్లంఘించి విదేశాల నుంచి అక్రమంగా నగదు లావాదేవీలు నిర్వహించారని టీటీవీ దినకరన్ మీద నమోదు అయిన కేసులో ఆయన విచారణకు హాజరైనారు. బుధవారం ప్రత్యేక కోర్టు ముందు టీటీవీ దినకరన్ తన న్యాయవాదులతో కలిసి హాజరైనారు. 
 
ఫెరా కేసు విచారణ జరుగుతున్న సమయంలో న్యాయమూర్తి మలర్ మతి టీటీవీ దినకరన్ న్యాయవాదిపై మండిపడ్డారు. మీరు కేసు విచారణ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని, ఏం తమాషాలు చేస్తున్నారా అంటూ మందలించారు. ఈ దెబ్బతో దినకరన్ షాక్‌కు గురైనాడు.