శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (12:49 IST)

ఆఫీసులకు అసభ్యకరమైన దుస్తులా? ఇక అలాంటివొద్దు..?

కార్యాలయాల్లో వేధింపులు, మహిళలపై లైంగిక దాడిని నియంత్రించేందుకు రాజస్థాన్ కార్మిక శాఖ చర్యలు తీసుకుంది. ఇకపై ఉద్యోగులు ఆఫీసులకు అసభ్యకరమైన దుస్తులు ధరించడం కూడదని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు తరచూ

కార్యాలయాల్లో వేధింపులు, మహిళలపై లైంగిక దాడిని నియంత్రించేందుకు రాజస్థాన్ కార్మిక శాఖ చర్యలు తీసుకుంది. ఇకపై ఉద్యోగులు ఆఫీసులకు అసభ్యకరమైన దుస్తులు ధరించడం కూడదని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు తరచూ జీన్స్, టీషర్టులు, అభ్యంతరకరమైన దుస్తులు ధరించి వస్తున్నారని, దీని వల్ల కార్యాలయ గౌరవం దెబ్బతింటోందని కార్మిక శాఖ కమిషనర్ గిరిరాజ్ సింగ్ కుశ్వాహ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇకపై అందరూ కార్యాలయ గౌరవాన్ని కాపాడేలా మర్యాదకరమైన, హుందాగా ఉండే దుస్తులు ధరించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఉద్యోగులు ప్యాంటులు, షర్టులు మాత్రమే ధరించి రావాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కానీ కార్మికశాఖ సర్క్యులర్‌పై ఉద్యోగులు మండిపడుతున్నారు. తాము ఎటువంటి దుస్తులు ధరించాలో కార్మికుల శాఖ ఆదేశాలు జారీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 
 
ఇంకా ఆల్ రాజస్థాన్ ఎంప్లాయిడ్ ఫెడరేషన్ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. డ్రెస్‌కోడ్‌ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.