శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2016 (09:53 IST)

ఓఎల్‌ఎక్స్‌లో పశువుల అమ్మకాలు... హర్యానా రైతు వినూత్న ఆలోచన

'ఓఎల్ఎక్స్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫోన్ల నుంచి ద్విచక్ర వాహనాల వరకు అన్నింటినీ ఇందులో పెట్టి ఇట్టే అమ్మేస్తున్నారు. అయితే హర్యానా రాష్ట్రంలో సోనిపట్‌కు చెందిన రైతు రాకేశ్ కత్రికి ఓ క

'ఓఎల్ఎక్స్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫోన్ల నుంచి ద్విచక్ర వాహనాల వరకు అన్నింటినీ ఇందులో పెట్టి ఇట్టే అమ్మేస్తున్నారు. అయితే హర్యానా రాష్ట్రంలో సోనిపట్‌కు చెందిన రైతు రాకేశ్ కత్రికి ఓ కొత్త ఆలోచన వచ్చింది. తన వద్ద ఉన్న పశువులను ఓఎల్‌ఎక్స్‌లో అమ్మేయాలన్న ఆలోచన వచ్చింది. 
 
ఈ ఆలోచన వచ్చిందే తడవుగా... తన పశువుల ఫోటోలు తీసి.. ఓఎల్‌ఎక్స్‌‍లో అప్‌లోడ్ చేశాడు. 12వ తరగతి వరకు చదువుకున్న రాకేశ్ గత నాలుగు నెలలుగా ఓఎల్ఎక్స్ ద్వారా 25 ఆవులు, గేదెలను విక్రయించాడు. లక్ష రూపాయల లాభాన్ని కూడా ఆర్జించాడు.
 
వాట్సాప్‌ ద్వారా తన యాడ్స్‌ను చూసిన వారు తనను సంప్రదిస్తుంటారని రాకేశ్ తెలిపాడు. ఇటీవల అశోక్, బాబు అనే ఇద్దరు వ్యక్తులు రాకేశ్ యాడ్‌ను చూసి అతడిని కలిశారు. రాకేశ్ ఆలోచన తమకు స్ఫూర్తి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు తాము ఓఎల్ఎక్స్‌లో పశువుల ఫొటోలు చూసి నచ్చితే విక్రయదారులను కలిసి బేరం కుదుర్చుకుంటున్నట్టు తెలిపారు.