ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 మే 2017 (17:43 IST)

భార్య మరో వ్యక్తితో లేచిపోయిందనీ.. కన్నబిడ్డను చంపేసిన కసాయి తండ్రి.. ఎక్కడ?

కట్టుకున్న భార్య తాము చెప్పిన మాట వినకుంటే ఏ భర్త కూడా తట్టుకోలేడు. అలాంటిది.. తనను కాదని మరో వ్యక్తితో భార్య లేచిపోవడంతో అతను రాక్షసుడిగా మారిపోయాడు. భార్యపై ఉన్న కోపాన్ని కున్నబిడ్డపై చూపించాడు. భార

కట్టుకున్న భార్య తాము చెప్పిన మాట వినకుంటే ఏ భర్త కూడా తట్టుకోలేడు. అలాంటిది.. తనను కాదని మరో వ్యక్తితో భార్య లేచిపోవడంతో అతను రాక్షసుడిగా మారిపోయాడు. భార్యపై ఉన్న కోపాన్ని కున్నబిడ్డపై చూపించాడు. భార్య చేసిన తప్పుకు అభంశుభం తెలియని ఎనిమిదేళ్ళ కుమార్తెను చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్‌ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాకు చెందిన మహ్మద్ ముస్తాక్ (40), దుఖ్నీ ఖాతూన్ (35) అనే దంప‌తుల‌ు ఉన్నారు. వీరికి ఎమినిదేళ్ల కూతురు ఉంది. అయితే, ఇటీవలే భర్తను వదిలివేసిన భార్య.. ఢిల్లీకి చెందిన మరో వ్యక్తితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త... భార్యపై ఉన్న కోపాన్ని అభం శుభం తెలియ‌ని త‌న కూతురిపై చూపించాడు. త‌న కూతురిని చావ‌బాదిన‌ ముస్తాక్ ఇంకా కోపం తగ్గకపోవ‌డంతో ఆమె పీక పిసికి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.