శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (09:40 IST)

జల్లికట్టు ఎఫెక్ట్: పెప్సీ, కోలాలపై నిషేధం.. ఊపందుకున్న గోలీ సోడాల విక్రయాలు

తమిళ రాష్ట్రంలోని అనేక సినిమా థియేటర్లలో పెప్సీ, కోకాకోలా శీతలపానీయాల విక్రయాలను నిషేధించారు. పెప్సీ, కోకాకోలా స్థానంలో స్వదేశీయంగా తయారు అవుతున్న గోలీ సోడా, కలర్ సోడా, నిమ్మకాయ సోడాలు అందుబాటులోకి తీ

తమిళ రాష్ట్రంలోని అనేక సినిమా థియేటర్లలో పెప్సీ, కోకాకోలా శీతలపానీయాల విక్రయాలను నిషేధించారు. పెప్సీ, కోకాకోలా స్థానంలో స్వదేశీయంగా తయారు అవుతున్న గోలీ సోడా, కలర్ సోడా, నిమ్మకాయ సోడాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గోలీసోడాకు క్రేజ్ పెరిగిపోతోంది. 
 
ఎలాగైనా మన దేశంలో తయారవుతున్నసోడాలకు ఇప్పుడు భలే గిరాకి వచ్చిందని సినిమా థియేటర్లకు వెలుతున్న సినీ అభిమానులు అంటున్నారు. అంతే కాకుండా చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని వివిద జిల్లాల్లో గోలీ సోడాల విక్రయాలు ఊపందుకున్నాయి. జల్లికట్టు ఆందోళన పుణ్యమా అంటూ మా వ్యాపారాలు జోరందుకున్నాయని గోలీ సోడాలు విక్రయిస్తున్న చిరు వ్యాపారులు అంటున్నారు.
 
కాగా జల్లికట్టును అడ్డుకుంటున్న పెటా సంస్థను నిషేధించాలని తమిళనాడులో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలకు పలు వ్యాపార సంఘాలు, సినీ పరిశ్రమ ప్రముఖులు, అనేక రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ఇస్తున్నారు. జల్లికట్టు నిర్వహణ కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తూ తమిళనాడులో విదేశీ శీతల పానీయాలైన పెప్సీ, కోకాకోలా విక్రయాలు నిలిపివేస్తున్నామని వ్యాపార సంఘాలు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.