నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)
వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తానీయులు భారతదేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఐతే కొంతమందికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా ఓ మహిళ తన సమస్యను మీడియా ద్వారా తెలియజేసింది. తనను వాఘా సరిహద్దును దాటి పాకిస్తాన్ దేశంలోకి ప్రవేశించనివ్వడం లేదంటూ చెపుతోంది.
తమకు పదేళ్ల క్రితం వివాహం అయ్యిందనీ, తమకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని చెప్పింది. ఆ ఇద్దరు పిల్లలు కూడా భారతదేశంలోనే పుట్టారనీ, ఐతే వారికి పాకిస్తాన్ దేశంలో వీసాలు వున్నాయనీ, ఇప్పుడు పాక్ వెళ్లేందుకు వారి ముగ్గురికీ ఎలాంటి సమస్య లేదనీ, కానీ తనకు మాత్రం పాక్ వీసా లేదంటూ వెల్లడించింది. తన భర్త, పిల్లలు పాకిస్తాన్ వీసాలతో వున్నారు కనుక వారు వెళ్లక తప్పదనీ, ఐతే తను కూడా వారితో కలిసి వెళ్లేలా ప్రధానమంత్రి మోడి తనకు సాయం చేయాలంటూ అభ్యర్థిస్తోంది.