శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (12:40 IST)

అమ్మకు ప్రేమతో.. 68 కిలోల ఇడ్లీ.. చెన్నై మెరీనా తీరంలో అమ్మ కోసం ఆలయం?

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణించిన నేపథ్యంలో.. ఆమె మరణించి ఇన్నాళ్లైనా.. తమిళనాడు ప్రజల గుండెల్లో మాత్రం ఆమెపట్ల అభిమానం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఏదో ఒక రూపంలో తమ అభిమానాన్ని వాళ్లు చాటుకుంటూన

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణించిన నేపథ్యంలో.. ఆమె మరణించి ఇన్నాళ్లైనా.. తమిళనాడు ప్రజల గుండెల్లో మాత్రం ఆమెపట్ల అభిమానం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఏదో ఒక రూపంలో తమ అభిమానాన్ని వాళ్లు చాటుకుంటూనే ఉన్నారు. చెన్నై మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధికి అభిమానులు భారీ స్థాయిలో నివాళులు అర్పిస్తున్నారు. 
 
తాజాగా జయలలిత వయసు (68 సంవత్సరాలు)ను సూచించేలా.. 68 కిలోల బరువున్న ఒక ప్రత్యేకమైన ఇడ్లీ ఒకదాన్ని తయారుచేశారు. అచ్చం జయలలిత ముఖం లాగే ఉండేలా దాన్ని రూపొందించారు. ఇంతకుముందు కూడా అమ్మ మీద అభిమానాన్ని పలు రకాలుగా తమిళ ప్రజలు చాటుకున్నారు. కానీ, తమిళులకు ప్రీతిపాత్రమైన టిఫిన్ అయిన ఇడ్లీని కూడా ఆమె ముఖం గుర్తుకొచ్చేలా తయారుచేయడం మాత్రం ఇదే మొదటిసారి. 
 
ఈ ఇడ్లీని అమ్మ సమాధి వద్ద ప్రజలకు సందర్శించే విధంగా ఉంచారు. అమ్మ మరణానికి అనంతరం అన్నాడీఎంకే కార్యకర్తలు అమ్మకు ఆలయంతో పాటు విగ్రహం కూడా సిద్ధం చేశారు. చెన్నై మెరీనాలోనే అమ్మకు ఆలయం నిర్మించేలా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.