సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (10:18 IST)

తమిళనాడు సీఎం జయలలితకు అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో అడ్మిట్

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు... కేవలం మానసికంగా అలసిపోవడం వల్ల కలిగ

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు... కేవలం మానసికంగా అలసిపోవడం వల్ల కలిగిన అస్వస్థతేనని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 
 
అయితే, జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో ఆమెను గురువారం రాత్రి 10.15 గంటల సమయంలో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. 
 
అమ్మ అనారోగ్యం పాలవడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఇటీవల కాలంలో ఆమె ఆరోగ్యం గురించి పార్టీ నేతలతో పాటు తమిళనాడు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆమె అనారోగ్యంతో బాధపడేవారు.