అత్యాచారాల కేంద్రంగా భారత్... వరుస రేప్‌లు ఇవే...
స్త్రీ జాతిపై అత్యాచారాలు పెరగడానికి కుటుంబాలు, సమాజం, ప్రభుత్వ నిర్లక్ష్యమే అసలు కారణమని ఎంతమందికి తెలుసు. దేశవ్యాప్తంగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. వీటిని అరికట్టడానికి ప్రభుత్వంలో కఠిన చట్టాలు, శిక్షలలో మార్పు వచ్చినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఏమీ తగ్గడంలేదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో బాలికలపై విచక్షణారహితంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.
క్రమంగా జరిగిన అత్యాచారాలను పరిశీలిస్తే ఢిల్లీలో కిరారీ ప్రాంతంలో గుడిసె బయట పడుకున్న ఎనిమిదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా అత్యాచారం చేశాడో బాలుడు. బాలికను బలవంతంగా స్థానికంగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. సీసీటీవీ వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
కాగా ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఖురేషి అనే 40 ఏళ్ల నకిలీ వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. మందుల కోసం దుకాణానికి వెళ్లిన యువతిని.. సదరు నకిలీ వైద్యుడు ఖురేషి మాయమాటలు చెప్పి క్లినిక్‌కి తీసుకొచ్చి అత్యాచారం చేశాడు. అలాగే, మహారాష్ట్రలో థానేలో 12 ఏళ్ల అమ్మాయిపై పొరుగున నివశించే ఖాన్ (42) అనే కామాంధుడు విచక్షణారహితంగా అత్యాచారం చేశాడు.
అలానే మీరట్‌లో మందుల కోసం వచ్చిన చిన్నారిని దుకాణం యజమాని నిర్బందించి రెండు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఛత్తీస్‌గఢ్‌లో ఉంటున్న 17 ఏళ్ల యువతిపై ఐదుగురు కామాంధులు అత్యాచారం చేశాడు. ఆ యువతి తల్లిదండ్రులు పొట్టకూటి కోసం మరో రాష్ట్రానికి వెళ్ళగా ఆ యువతి ఆమె అక్క వద్ద ఉంటుంది. ఈ క్రమంలో ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.