1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (11:31 IST)

క్లైమాక్స్‌కు చేరిన తమిళనాడు రాజకీయాలు.. అసెంబ్లీలో గందరగోళం...

తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్ చేరాయి. కొన్ని నిమిషాల్లో తమిళనాడు సీఎం ఎవరన్నది తేలిపోనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, స

తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్ చేరాయి. కొన్ని నిమిషాల్లో తమిళనాడు సీఎం ఎవరన్నది తేలిపోనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, స్టాలిన్ తమ వర్గీయులతో అసెంబ్లీకి చేరుకున్నారు. 
 
అసెంబ్లీ వేదికగా పళనిస్వామి, పన్నీర్‌సెల్వం బలనిరూపణ చేసుకోనున్నారు. బలపరీక్షలో ఆఖరినిమిషాన ఏం జరుగుతుందో ఏమోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ భవనం చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.
 
ఇదిలావుండగా, సభ ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళం నెలకొంది. రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వంతో పాటు.. విపక్ష పార్టీలైన డీఎంకే, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 
 
కాగా, అన్నాడీఎంకేకు 134 మంది సభ్యులున్నారు. బలపరీక్షలో విజయానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 117. బలపరీక్షకు వెళుతుండగా పళనిస్వామి వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే పన్నీర్‌సెల్వం మద్దతిస్తానని ఆయన గూటికి చేరుకున్నారు. దీంతో పన్నీర్‌ బలం 12కు చేరింది. ఇక, ఎడప్పాడి వైపు 122 మంది మాత్రమే నిలిచారు.