పుస్తకంలో తుక్కు అని రాసినందుకే జర్నలిస్టును చంపించిన చోటారాజన్!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు జ్యోతిర్మయ్ డే హత్య కేసును సీబీఐ విచారిస్తుండగా, ఈ కేసులో తాజాగా చార్జిషీటును దాఖలు చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు జ్యోతిర్మయ్ డే హత్య కేసును సీబీఐ విచారిస్తుండగా, ఈ కేసులో తాజాగా చార్జిషీటును దాఖలు చేసింది. జ్యోతిర్మయ్ డే రాసిన ఒక పుస్తకంలో ముంబై నేరప్రపంచంలో రారాజు దావూదేనని, రాజన్ కేవలం చిందీ(తుక్కు) మాత్రమేనని రాయడంపై ఆగ్రహించిన రాజన్... జర్నలిస్టును హత్య చేసినట్టు అందులో పేర్కొంది.
డేను హత్య చేసిన సిండికేట్ వెనుక ప్రధాన సూత్రధారి రాజనేనని అందులో స్పష్టం చేసింది. ఇందుకు నగదు కూడా అతడే సమకూర్చాడని వెల్లడించింది. ఈ కేసులో 41 మంది సాక్షుల కథనాలను సీబీఐ నమోదు చేసింది. ఇదివరకు సాక్షిగా పేర్కొన్న రవిరాం అనే వ్యక్తిని తాజా చార్జిషీటులో నిందితునిగా చేర్చారు. హత్యకు సమన్వయకర్తగా పనిచేయడమే కాకుండా సిమ్‌లను కూడా అతడే సమకూర్చాడని సీబీఐ తెలిపింది.