ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (12:41 IST)

కట్టుతప్పిన జల్లికట్టు... పోలీసు స్టేషన్‌కు నిప్పు.. రణరంగంగా చెన్నై నగరం

జల్లికట్టు ఉద్యమం కట్టుతప్పింది. గత వారం రోజులుగా మెరీనా తీరంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువతను ఖాళీ చేయించేందుకు సోమవారం పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్యమం కట్టుతప్పింది. మెరీనా బీ

జల్లికట్టు ఉద్యమం కట్టుతప్పింది. గత వారం రోజులుగా మెరీనా తీరంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువతను ఖాళీ చేయించేందుకు సోమవారం పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్యమం కట్టుతప్పింది. మెరీనా బీచ్‌ను ఖాళీ చేసేందుకు ఉద్యమకారులు నిరాకరించడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన పోలీసులు చెన్నై, ఐస్‌హౌస్ పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. 
 
గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఐస్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌ను తగులబెట్టారు. ఐస్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌ నుంచి మెరీనా బీచ్ వరకు దట్టంగా పొగ వ్యాపించింది. ఉద్యమకారుల ముసుగులో సంఘ విద్రోహశక్తులు ప్రవేశించాయని ప్రభుత్వం ఆరోపించిన కాసేపటికే పోలీస్‌స్టేషన్‌ను తగులబెట్టారు. 
 
తమిళనాడులో జల్లికట్టు నిషేధంపై శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ప్రజలు చేస్తున్న నిరసన తీవ్రతరమైంది. ఆర్డినెన్స్ జారీ చేస్తున్నట్లు ప్రకటించినా తమిళుల పోరాటం ఆగలేదు. సమస్యకు పరిష్కారం తాత్కాలిక ఆర్డినెన్స్ కాదని పూర్తి స్థాయిలో నిషేధం ఎత్తివేసే దాకా తమ పోరాటం ఆగదని తమిళులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.