మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (12:40 IST)

శశికళకు తేరుకోలేని షాకిచ్చిన సుప్రీంకోర్టు... ఆ కేసులో వారం రోజుల్లో తుదితీర్పు

తమిళనాడు ముఖ్యమంతిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించి.. తాను సీఎం కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్ళూరుతున్న ముఖ్యమంత్రి దివగంత జయలలిత ప్రిచనెచ్చెలి శశికళ నటరాజన్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానమైన స

తమిళనాడు ముఖ్యమంతిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించి.. తాను సీఎం కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్ళూరుతున్న ముఖ్యమంత్రి దివగంత జయలలిత ప్రిచనెచ్చెలి శశికళ నటరాజన్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సోమవారం తేరుకోలేని షాకిచ్చింది. జయలలిత అక్రమాస్తుల కేసులో తుది తీర్పును వారం రోజుల్లో వెల్లడించనున్నట్టు సోమవారం తెలిపింది. ఇది శశికళకు శరాఘాతంగా మారింది. 
 
అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ జయలలితపై అవినీతి నిరోధక చట్టం కింద 1996లో కేసు నమోదైంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 2014లో జయను దోషిగా పేర్కొంటూ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెతో పాటు సహనిందితురాలిగా ఉన్న శశికళకు కూడా జైలు శిక్ష పడింది. అయితే, 2015లో కర్ణాటక హైకోర్టు జయలలితపై నమోదైన కేసును కొట్టేసి ఆమెకు విముక్తి కల్పించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న అపెక్స్ కోర్టు.. తుది తీర్పును వారం రోజుల్లో వెల్లడించనున్నట్టు ప్రకటించింది. 
 
కాగా, ప్రత్యేక కోర్టు తీర్పుతో జయలలిత కొంతకాలం సీఎం పీఠానికి దూరమైనప్పటికీ... గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లీ అధికారం చేపట్టారు. జయ మరణంతో ఆమె దశాబ్దాలుగా కొనసాగిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ చేపట్టారు. దీనిపై కూడా ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఆమె లక్ష్యానికి అడ్డుతగిలేలా ఉన్నాయి.