గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (09:35 IST)

ఎంజీఆర్ సమాధి పక్కనే.. జయలలిత అంత్యక్రియలు.. భారీగా చెన్నైకి జనాలు..

తమిళనాడు సీఎం జయలలిత పార్థీవ దేహాన్ని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అమ్మను చివరిసారిగా అమ్మను చూసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి ఆమె ఫ్యాన్స్, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద

తమిళనాడు సీఎం జయలలిత పార్థీవ దేహాన్ని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అమ్మను చివరిసారిగా అమ్మను చూసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి ఆమె ఫ్యాన్స్, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో చెన్నై నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
 
ప్రజల సందర్శనార్ధం పార్థీవ దేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ పరిసర ప్రాంతాల్లోను భద్రత కట్టుదిట్టం చేశారు. భారీకేడ్లు ఏర్పాటు చేసి క్యూలలో ప్రజలను పంపిస్తున్నారు. చెన్నై మెరీనా బీచ్‌ లోని ఎంజీఆర్‌ సమాధి పక్కన మంగళవారం సాయంత్రం 5-6 గంటల మధ్య జయలలిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 
అయితే అమ్మను చూసేందుకు ఈ రోజు ఒక్కరోజే సమయం ఉండటంతో అమ్మ ముఖాన్ని చివరిసారిగా చూసేయాలని జనాలు భారీగేడ్లను ధ్వంసం చేసి.. అడ్డదారిన లోనికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. భారీ ఎత్తున జనాలు తరలి రావడంతో భద్రత నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.