మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 జులై 2017 (14:31 IST)

బ్లూ ఫిల్మ్ అంటే ఏంటో తెలుసా? ఎపుడైన చూశారా? ప్రజలను ప్రశ్నించి సీఎం..

ఇటీవలి కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిత్యం వివాదాల్లో చిక్కుకుని వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోమారు దుమారం రేపాయి. ప్రజలను ఉద్దేశించి బ్లూ ఫిల్మ్ ఎపుడైనా చూశారా అంటూ

ఇటీవలి కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిత్యం వివాదాల్లో చిక్కుకుని వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోమారు దుమారం రేపాయి. ప్రజలను ఉద్దేశించి బ్లూ ఫిల్మ్ ఎపుడైనా చూశారా అంటూ ప్రశ్నించారు. దీంతో వారు ఖంగుతిన్నారు. ఆయన ఇలాంటి ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందో ఓసారి పరిశీలిస్తే.. 
 
బెళగావి జిల్లాలో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.."మీ బీజేపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఎందుకు పోగొట్టుకున్నారో తెలుసా? మీరు అడగండి. అసలు బ్లూ ఫిల్మ్ అంటే ఏంటో మీకు తెలుసా? ఎప్పుడైనా ఒక్కసారైనా చూశారా? అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయం లోపల మీ ఎమ్మెల్యే బ్లూ ఫిల్మ్ చూస్తూ దొరికిపోయాడు. 
 
అలాంటి ఎమ్మెల్యేని అధికారంలో ఉంచకూడదు. వెంటనే దించేయాలి. ఇలాంటి వ్యక్తులు జనజీవనంలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి సిగ్గులేని వ్యక్తి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలి’’ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దారామయ్య బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.