మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (08:37 IST)

భర్త ముందే విధవరాలిని చేశారు.. ఇదీ పాకిస్థాన్ దుర్నీతి

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమైన స్త్రీ మంగళసూత్రాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తుంది. భర్త జీవించివుండగా, మంగళసూత్రాన్ని మెడలోనుంచి బయటకు తీయదు.

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమైన స్త్రీ మంగళసూత్రాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తుంది. భర్త జీవించివుండగా, మంగళసూత్రాన్ని మెడలోనుంచి బయటకు తీయదు. కానీ, ఏమాత్రం మానవీయ విలువలులేని పాకిస్థాన్ పాలకులు మాత్రం భర్త ముందే ఓ హిందూ స్త్రీని విధవరాలిని చేశారు. నుదుట బొట్టును చెరిపేశారు. మెడలోని మంగళసూత్రంతో పాటు.. చేతులకు ధరించిన గాజులను కూడా తీయాలని హుకుం జారీచేశారు. దీంతో తన భర్తను చూడాలన్న ఆశతో ఆ మహిళ కొద్దిసేపు విధవరాలిగా మారింది. ఆమె ఎవరో కాదు... కుల్‌భూషణ్ యాదవ్ సతీమణి చేతన్‌కుల్. 
 
భారత నౌకాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌‌ను గూఢచర్య అరోపణలపై అరెస్ట్‌ చేసి మరణశిక్ష విధించిన విషయం తెల్సిందే. తన భర్తను చూడడానికి అనుమతించాలని జాదవ్ భార్య కోరగా, అందుకు పాక్ సర్కారు అనుమతిచ్చింది. దీంతో ఇటీవల ఇస్లామాబాద్‌కు జాదవ్ భార్య చేతన్‌కుల్‌, తల్లి అవంతిలు వెళ్లారు. అక్కడకు చేరుకున్నాక ఓ పాత షిప్పింగ్‌ కంటైనర్‌ వెనుక భాగానికి వీరిద్దరినీ తీసికెళ్ళారు. అక్కడ ఓ గాజుగోడ అడ్డుగా ఉన్న చిన్న గదిలో ఓ వైపు వీరిరువురినీ, ఆవలవైపు కుల్‌భూషణ్‌నీ నిల్చోబెట్టి అప్పుడు మాట్లాడుకోమన్నారు. 
 
మాటలకు ముందు భార్య చేతనను కుంకుమ బొట్టు చెరిపేయమన్నారు. మంగళసూత్రాన్ని, గాజులను తీసేయమన్నారు. వారిద్దర్నీ కట్టుకున్న బట్టలు మార్చేసి వేరేవి కట్టుకోమన్నారు. ఓ విధవరాలిలా కనిపించాలని ఆదేశించారు. తల్లి అవంతిని కూడా బొట్టు తీసేయమన్నారు. ఆమె కొడుకుతో మరాఠీలో మాట్లాడబోతే అడ్డుకుని హిందీలోనో, ఇంగ్లీషులోనో మాట్లాడాలని షరతు పెట్టారు. 
 
ఇద్దరి మధ్యా ఓ చిన్న ఇంటర్‌కమ్‌‌లాంటిది పెట్టి - ప్రతీ మాటకు ముందూ ఓ అధికారి స్విచాఫ్‌ చేసి 'ఇపుడేం మాట్లాడేవో చెప్పు' అని ప్రశ్నించారు. ఉన్న 40 నిముషాల సేపూ ఇదే తంతు. భార్యా భర్తలిరువురినీ ఆలింగనం చేసుకోనివ్వలేదు. కొడుకుకు కొన్ని క్రిస్మస్‌ స్వీట్లు తీసుకెళ్ళింది అవంతి... వాటిని ఇవ్వడానికి వీల్లేదని పారేశారు. అడుగడుగునా వేధింపులే... నీ కొడుకును నీకు చూపించడమే చాలా ఎక్కువ అని ఈసడించారు.