శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 10 నవంబరు 2016 (11:25 IST)

రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయమని సలహా ఇచ్చింది ఎవరో తెలుసా?

దేశంలో కరెన్సీ కల్లోలానికి కారణం ఎవరో తెలుసా. ఓ చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన పేరు అనిల్ బొకిల్. ఔరంగాబాద్ వాసి. ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే కాదు.. ఓ ఆర్కిటెక్ట్ కూడా. అయితే, నల్లధనాన్ని అరికట్టేందుకు

దేశంలో కరెన్సీ కల్లోలానికి కారణం ఎవరో తెలుసా. ఓ చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన పేరు అనిల్ బొకిల్. ఔరంగాబాద్ వాసి. ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే కాదు.. ఓ ఆర్కిటెక్ట్ కూడా. అయితే, నల్లధనాన్ని అరికట్టేందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన పలు సూచనలు సిద్ధం చేశారు. వీటిని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెప్పుకోవాలని భావించి.. అపాయింట్మెంట్ కోరారు.
 
ఆయన విన్నపాన్ని స్వీకరించిన ప్రధాని... కేవలం ఎనిమిది నిమిషాల పాటు అపాయింట్మెంట్ కేటాయించారు. అనుకున్నట్టుగానే ప్రధాని మోడీతో అనిల్ బొకిల్ సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య జరగాల్సిన ఎనిమిది నిమిషాల సమావేశం ఏకంగా.. రెండు గంటలకు పైగా సాగింది. 
 
లెక్కల్లో చూపించని నల్లధనం వల్లే రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని... దీని ప్రభావంతో డబ్బు కూడా తన విలువ కోల్పోతోందనేది అనిల్ భావన. ఈ వ్యవహారానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలనేది ఆయన ఆలోచన. కేవలం పెద్ద నోట్ల రద్దే కాదు... ప్రధానికి ఆయన పలు విషయాలను సూచించారు. 
 
ఆయన చేసిన ప్రతిపాదనల్లో... పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000లను తక్షణం రద్దు చేయాలి. ఎక్కువ మొత్తంలో జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకు మార్గంలోనే జరగాలి. డీడీ, ఆన్ లైన్, చెక్కు రూపంలోనే ఇవి ఉండాలి. నగదు లావాదేవీలకు నిర్దిష్టమైన పరిమితి విధించి... దానిపై పన్ను లేకుండా చూడాలి. 
 
బ్యాంక్ లావాదేవీలపై పన్ను (కేవలం క్రెడిట్ మీదే) 2 శాతం విధించి... దాని మీదే ప్రభుత్వం ఆదాయం పొందాలి. ఇలాంటి అమూల్యమైన సలహాలను ఆయన ఇచ్చారు. వీటిపై ఆర్థిక శాఖతో చర్చించిన ప్రధాని.. వీటి అమలుకు పచ్చజెండా ఊపారు. ఆ తర్వాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.