బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (11:01 IST)

మగాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారా? మేనకా గాంధీ ఆశ్చర్యం

మగాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారా? నేనెప్పుడూ వినలేదే! అంటూ కేంద్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఫేస్‌‌బుక్‌ లైవ్‌ సెషన

మగాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారా? నేనెప్పుడూ వినలేదే! అంటూ కేంద్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఫేస్‌‌బుక్‌ లైవ్‌ సెషన్‌‌లో పురుషుల ఆత్మహత్యలను తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఒక నెటిజన్ ప్రశ్నించాడు. దానికి ఆమె సమాధానమిచ్చారు. 
 
మగవాళ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారా? ఏ మగాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఆత్మహత్య చేసుకోవడం కంటే పరిస్థితులను ఎందుకు చక్కదిద్దుకోవడం లేదు? అయినా తాను పురుషుల ఆత్మహత్యల గురించి ఎప్పుడూ వినలేదు, చదవలేదు అంటూ పేర్కొన్నారు. దీంతో లైవ్‌లో వ్యక్తి ఆశ్చర్యపోయారు.