ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (08:59 IST)

బోసిపోయిన అమ్మ నివాసం వేదనిలయం... ఇక స్మారక మందిరం!

ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసమైన వేద నిలయం ఇపుడు కళ తప్పింది. నిత్యం వందలాది మంది కార్యకర్తలతో నిత్యం సందడిగా కనిపించే ఈ ప్రాంతం ఇపుడు బోసిపోయింది. జయ అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు... ఇళవరసి, సుధా

ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసమైన వేద నిలయం ఇపుడు కళ తప్పింది. నిత్యం వందలాది మంది కార్యకర్తలతో నిత్యం సందడిగా కనిపించే ఈ ప్రాంతం ఇపుడు బోసిపోయింది. జయ అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు... ఇళవరసి, సుధాకరన్‌లు సుప్రీంకోర్టు శిక్షలు విధించిన విషయం తెల్సిందే. 
 
నిజానికి జయలలిత మరణానంతరం పోయెస్‌గార్డెన్‌లోని ఆమె నివాసం ‘వేద నిలయం’లో శశికళ, ఆమె సోదరుడి భార్య ఇళవరసి కాలుమోపారు. అక్కడి నుంచే శశికళ చక్రం తిప్పారు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో వారు జైలుకు వెళ్లనున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ప్రస్తుతం ‘వేద నిలయం’ కళ తప్పి ఇప్పుడది ఖాళీ కానుంది.
 
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వేద నిలయాన్ని స్మారక మందిరం చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే డిమాండ్‌తో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం  వారం రోజులుగా సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా చేపట్టారు. అన్నాడీఎంకే వర్గాలతోపాటు ప్రజల నుంచి కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ‘అమ్మ’ నివసించిన వేదనిలయం తమకు మందిరంతో సమానమని, అందులో దోపిడీదారులైన ఇతరులు నివసించేందుకు అంగీకరించేది లేదని పన్నీర్ సెల్వం వర్గం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.