పురిటి నొప్పులొచ్చాయ్.. సైకిల్‌పై 6కిలో మీటర్ల మేర నిండు గర్భిణీ పయనం.. ఆపై ఏం జరిగింది..?
ఒడిశాలో మరణించిన భార్య శవాన్ని కిలోమీటర్ల మేర మోసిన భర్త ఘటన మరవకముందే.. నిండు గర్భిణికి పురిటినొప్పులొచ్చినా తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సేవలు అంతగా సహకరించలేదు. దీంతో సైకిల్ పైనే వెళ్ళిన బాలింత ఓ పండ
ఒడిశాలో మరణించిన భార్య శవాన్ని కిలోమీటర్ల మేర మోసిన భర్త ఘటన మరవకముందే.. నిండు గర్భిణికి పురిటినొప్పులొచ్చినా తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సేవలు అంతగా సహకరించలేదు. దీంతో సైకిల్ పైనే వెళ్ళిన బాలింత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన ఛాట్టార్ పూర్ జిల్లా షాహపూర్ గ్రామానికి చెందిన పార్వతి (22) అనే మహిళ నిండు గర్భిణి. ఈమెకు పురిటి నొప్పులు రావడంతో ఆంబులెన్స్‌కు ఫోన్ చేసినా స్పందన రాలేదు.
దీంతో పార్వతిని ప్రసవం కోసం తీసుకువెళ్లేందుకు ఆమె తండ్రి నన్హేభాయి అంబులెన్సు నుంచి సమాధానం రాకపోవడంతో తన కూతురును సైకిల్‌పై కూర్చోబెట్టి.. ఆరుకిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో పార్వతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మళ్లీ తల్లీ బిడ్డలను సైకిలుపైనే ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు.
తన కూతురు పురిటి నొప్పులతో బాధపడుతున్నప్పుడు జననీ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ కోసం చాలాసార్లు ఫోన్ చేశానని.. అయితే స్పందన లేకపోవడంతో సైకిల్ పైనే ఆస్పత్రికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు.