నో ఇన్‌కమ్ టాక్స్... త్వరలో ప్రధాని మోదీ శుభవార్త...? దేశం కేరింతలు కొట్టదూ...!!
న్యూఢిల్లీ : బాబోయ్... మోదీ ఇలా వాయించేస్తున్నారేంటి? ఎవరి నోటి వెంట విన్నా ఇదే మాట... ఎక్కడ చూసినా నోట్ల రద్దుపై చర్చే. అయినా ప్రధాని మోదీ మాత్రం కించిత్ కూడా వెనకడుగు వేయడం లేదు. దేశ ప్రజ
న్యూఢిల్లీ : బాబోయ్... మోదీ ఇలా వాయించేస్తున్నారేంటి? ఎవరి నోటి వెంట విన్నా ఇదే మాట... ఎక్కడ చూసినా నోట్ల రద్దుపై చర్చే. అయినా ప్రధాని మోదీ మాత్రం కించిత్ కూడా వెనకడుగు వేయడం లేదు. దేశ ప్రజలారా! కాస్త ఇబ్బంది అయినా తప్పదు. ఓపిక పట్టండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయంటూ భరోసా ఇస్తున్నారు. అసలు ప్రధాని మోదీ మదిలో ఉన్న నిఖార్సయిన ఆలోచన ఏంటి?
దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టడానికి నోట్ల రద్దు ఉపయోగపడుతుందని మోదీ నమ్ముతున్నారు. దేశంలోని అన్ని వ్యాపార లావాదేవీలు ఆన్‌లైన్‌లో, పారదర్శకంగా... మనీ అంతా వైట్‌లో నడవాలనేది ఆయన అభిమతం. ఇలా అంతా సజావుగా సాగితే, దేశ వ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టి... ఎక్కడ ఏ వస్తువు కొన్నా... ఒకేరకంగా పన్నులు రాబట్టి సర్కారు ఖజానాను అభివృద్ధి చేయాలి. దేశ ప్రగతికి ఆ ధనం ఉపయోగపడాలి.
ఇలా అనుకున్నట్లు అంతా సాగితే, కొంచెం ఆలస్యం అయినా ఒక పెను నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారట. అదేదో కాదు... దేశంలో చాలామంది పెద్దలు నుంచి మొదలుకొని చిరు వ్యాపారుల వరకు అందరూ సతమతం అయ్యేది ఇన్‌కంట్యాక్స్ గురించే. అవును... దేశంలో విప్లవాత్మకంగా ఐ.టి.ని రద్దు చేసి, సంచలనం సృష్టించాలని మోదీ సంకల్పమట.
దీని ద్వారా తన ఆర్థిక సంస్కరణలకు ముగింపు పలకాలని మోదీ భావిస్తున్నారని సమచారం. అన్ని వినిమయ వస్తువులకు పన్నులు సరిగా కడితే, ఇక ఆదాయ పన్నుతో పనేముందనేది విప్లవాత్మక కాన్సెప్ట్. వచ్చే ఎన్నికల నాటికి ఈ కాన్సెప్ట్‌ని అమలు చేస్తే... దేశంలోని బడా బాబుల నుంచి, చిరు వ్యాపారులు, వేతన జీవులు కూడా హ్యాపీగా ఫీలవుతారు. మోదీకి జై అంటూ మరోసారి విజయం అందిస్తారనే ఆలోచలో ఉన్నారట.