శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జూన్ 2016 (14:18 IST)

చురకలంటించిన ప్రధాని మోడీ: ట్విట్టర్లో సుబ్రహ్మణ్య స్వామి గీతోపదేశం...!

సెలెబ్రిటీలు, ఉన్నత హోదాల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారిపై ఏదొక కేసు పెడతానని కామెంట్లు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి జోరుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రేక్ వే

మొన్నటివరకు తమిళనాడు సీఎం జయలలితను కేసులో ఇరికించారు. నిన్నటికి నిన్న ఆర్బీఐ రఘురామ్ రాజన్‌ను మనస్తాపానికి గురిచేశారు. ఇదేవిధంగా సెలెబ్రిటీలు, ఉన్నత హోదాల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారిపై ఏదొక కేసు పెడతానని కామెంట్లు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి జోరుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. 
 
అందుకేనేమో సుబ్రహ్మణ్య స్వామి గీతోపదేశం చేస్తున్నారు. ట్విట్టర్లో తత్త్వం బోధిస్తూ ట్విట్టర్‌కెక్కారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అంశంపై మోడీ స్వామికి పరోక్షంగా చురకలంటించడంతో స్వామి ట్విట్టర్లో హితబోధ చేశారు. ఈ  సందర్భంగా కృష్ణుడి గీతోపదేశాన్ని స్వామి గుర్తు చేసుకున్నారు. 
 
''సుఖ దుఃఖాలు జీవితంలో భాగమని, మార్పు సైతం మామూలేనని'' శ్రీకృష్ణుడు చెప్పాడు.. అంటూ స్వామి ట్వీట్ చేశాడు. దీంతో స్వామికి మోడీ దిమ్మదిరిగే చురకలంటించేవుంటారని.. అందుకే సైలెంట్‌గా కృష్ణుడి తత్త్వాన్ని స్వామి చేతికందుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ ఇంటర్వ్యూలో యూపీఏ హయాంలో నియమితులైనప్పటికీ ఆర్బీఐ రాజన్‌ తన పదవీకాలంలో పూర్తిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆయన దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదని, ఆయనో గొప్ప దేశభక్తుడని వ్యాఖ్యానించారు. పబ్లిసిటీ కోసం వ్యాఖ్యలు చేయకూడదని.. స్వామిని ఉద్దేశించి పరోక్షంగా చురకలంటించారు.