మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 9 డిశెంబరు 2016 (15:58 IST)

శశికళతో పదేపదే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం భేటీ...? కారణం అదేనా?

అన్నాడీఎంకె పార్టీ మెయిన్ ఫ్యూజ్(జయలలిత) పోయింది. అన్నాడీఎంకే పార్టీ అంటే అది జయలలిత సొంత ఆస్తి అన్నట్లుగా ఉండేది. ఆమె స్వర్గస్తులయ్యాక పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంలో పడిపోయిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

అందుకే పార్టీ పగ్గం ఒకరికి ప్రభుత్వ పాలన ఇంకొకరికి అనే ఫార్ములాతో పన్నీర్ సెల్వం, శశికళ ముందుకు సాగనున్నారనే చర్చ జరుగుతోంది. ఐతే గురువారం నాడు శశికళతో భేటీ అయిన ముఖ్యమంత్రి మళ్లీ శుక్రవారం నాడు సమావేశం కావడం గమనార్హం. మరోవైపు శశికళ తనకు ముఖ్యమంత్రి పీఠం కావాలని పట్టుబడుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే శశికి సీఎం పోస్ట్ ఇస్తే పార్టీ ఊస్టింగ్ అయిపోతుందని చాలామంది బహిరంగంగానే చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పన్నీర్ సెల్వం ఎలా నడుచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.