శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (11:11 IST)

తమిళనాడు తాత్కాలిక సీఎంగా పన్నీర్ సెల్వం?

తమిళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్‌సెల్వం నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 17 రోజులుగా ఆమె చికిత్స

తమిళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్‌సెల్వం నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 17 రోజులుగా ఆమె చికిత్స పొందుతున్నారు. దీంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి తెరపైకి వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలనకు ఆటంకం కలుగకుండా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జయలలితకు చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో పన్నీర్ సెల్వంను తాత్కాలిక సీఎంగా నియమించే అవకాశమున్నట్లు సమాచారం. 
 
తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ఇంఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుతో మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామితోపాటు సీఎస్ రామ్మోహన్‌రావు సమావేశమయ్యారు. వీరంతా కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవిపైనే చర్చించినట్టు సమాచారం.