మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (15:07 IST)

ఢిల్లీలో సరిబేసి విధానం : బీజేపీ నేతకు ఫైన్ - సైకిల్‌పై ఉపముఖ్యమంత్రి

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపైకి వచ్చే వాహనాలకు సరి-బేసి విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. కానీ, బీజేపీ నేత విజయ్ గోయల్ మాత్రం ఈ విధానాన్ని తప్పుబట్టారు. సోమవారం సరి సంఖ్య ఉన్న వాహనాలు మాత్రమే రోడ్లపై తిరగాల్సి వుండగా, ఆయన ఉద్దేశ్యపూర్వకంగా బేసి సంఖ్య ఉన్న వాహనంలో ప్రయాణించారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనకు అపరాధం విధించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'ఈ విధానం ఢిల్లీ ప్రభుత్వ గిమ్మిక్కు మాత్రమే. పంట వ్యర్థాల కారణంగానే ఢిల్లీలో వాయు కాలుష్యం ఏర్పడిందని వారు అంటున్నారు. మరి సరి-బేసి విధానం అమలు చేస్తే ఏం లాభం?' అని ప్రశ్నించారు. 
 
మరోవైపు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రజల్లో కాలుష్యంపై అవగాహన కలిగించడం కోసం సైకిల్ తొక్కుతూ తన కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వం ఆదేశాలను పాటించకపోయినా.. వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని సరిబేసి విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.