శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2016 (15:57 IST)

అన్నాడీఎంకేతో పొత్తా? మాకేం పట్టింది.. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోం.. ఓపీకి ఫుల్ సపోర్ట్!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశాక.. కేంద్రం ఆదేశాలతో ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చి.. అమ్మ అంత్యక్రియలను పూర్తి చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నాడీఎంకే పార్టీని బీజేపీ రిమోట్‌లోకి తీసు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశాక.. కేంద్రం ఆదేశాలతో ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చి.. అమ్మ అంత్యక్రియలను పూర్తి చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నాడీఎంకే పార్టీని బీజేపీ రిమోట్‌లోకి తీసుకుందంటూ వస్తున్న వార్తల్ని ఖండించారు.

తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్ళొచ్చాక దూకుడు పెంచారని.. కేంద్రం ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇస్తుందనే మాటలపై కూడా వెంకయ్య స్పందించారు. దివంగత సీఎం జయలలితకు పన్నీర్ సెల్వం నమ్మినబంటు. అందుకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెంకయ్య క్లారిటీ ఇచ్చారు. తమిళ రాష్ట్రానికి ఎలాంటి సాయం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వెంకయ్య మీడియాతో చెప్పారు. 
 
జయలలిత స్వయంగా ఓపీని రెండుసార్లు సీఎం చేసిన విషయం తమకు గుర్తుందని.. ఆయనకు ప్రజా మద్దతు కూడా ఉందని వెంకయ్య వ్యాఖ్యానించారు. అమ్మ మరణించిన తరువాత ఆమె అడుగుజాడల్లో పన్నీర్ సెల్వం నడుచుకుంటారని ఆశిస్తున్నట్లు వెంకయ్య వ్యాఖ్యానించారు.

ఇకపోతే.. అన్నాడీఎంకే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదని వెంకయ్య స్పష్టం చేశారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోనే అవసరం బీజేపీకి లేదని కుండలు బద్దలు కొట్టి చెప్పారు.