జయహో.. మోడీ : నోట్ల రద్దుతో మాకేం ఇబ్బంది లేదు.. : 'సీ-ఓటర్' సర్వేలో వెల్లడి
దేశంలో నల్లధనం వెలికితీత చర్యల్లో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. 'నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయినా
దేశంలో నల్లధనం వెలికితీత చర్యల్లో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. 'నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయినా ఏం ఫర్వాలేదు. నల్లధనంపై ప్రధాని ప్రకటించిన యుద్ధానికి మా మద్దతు ఉంటుంది'.. అని వారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. నోట్ల రద్దుపై ప్రధాని మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని 80 - 86 శాతం మంది ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ విషయం అంతర్జాతీయ పోలింగ్ ఏజెన్సీ సీ-ఓటర్ దేశవ్యాప్తంగా పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది.
ఈ సర్వేలో పాల్గొన్న గ్రామీణపట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 86 శాతం మంది నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనన్నారు. మోడీ నిర్ణయాన్ని సమర్థించిన వారిలో చాలామంది అధిక ఆదాయం కలవారే. నోట్ల రద్దు చాలా మంచి నిర్ణయమని, చక్కగా అమలు చేస్తున్నారని సర్వేలో పాల్గొన్న వారిలో అధికశాతం మంది అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది ఇదే విధమైన అభిప్రాయం వెల్లడించగా, సెమీ అర్బన్ ప్రాంతాల వారు 65.1 శాతం, సెమీ రూరల్ జోన్స్‌లో 59.4 శాతం మంది నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు.
నల్లధనంపై యుద్దానికి నోట్ల రద్దు ఎంతగానో ఉపకరిస్తుందని 86 శాతం మంది పట్టణ ప్రజలు, 80.6 శాతం మంది సెమీ అర్బన్, 86 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలు అభిప్రాయపడ్డారు. వీరిలో 83.7 శాతం మంది అతి తక్కువ ఆదాయం కలిగిన వారు కాగా 84.4 శాతం మంది మధ్యతరగతి వర్గాలు. 90.6 శాతం మంది అధికాదాయ వర్గాల వారు ఉన్నారు.